నేటి నుంచి 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల్లో మినిమమ్ టైమ్ స్కేలులో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల (2,193 మంది) ధ్రువపత్రాల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ జారీచేశారు. ఈ నెల 28వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సర్క్యులర్‌లో పొందుపరిచారు.
Published date : 25 Jun 2021 04:30PM