నేడు ఏపీ గ్రామ/వార్డు సచివాలయ రాతపరీక్షలు-2020 ‘కీ’ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి అధికారిక ‘కీ’ సెప్టెంబర్ 26వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
19 కేటగిరీల్లో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రోజుకు రెండు చొప్పున రాత పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 10,56,931 మంది దరఖాస్తు చేసుకోగా, సెప్టెంబర్ 26వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రం జరిగే పరీక్ష ముగిసిన వెంటనే మొత్తం 14 రకాల పరీక్షలకు సంబంధించిన అధికారిక ‘కీ’ ఒకసారే విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధికారిక ‘కీ’ వివరాలు గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అలాగే ఏపీ గ్రామ/వార్డు రాతపరీక్షలు-2020 ‘కీ’ వివరాలను అభ్యర్థులు ‘సాక్షి ఎడ్యుకేషన్’ వెబ్ పోర్టల్(www.sakshieducation.com) ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలన్ని కీతో పాటు క్వశ్చన్ పేపర్ కూడా సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో అందుబాటులో ఉంటుంది.
Published date : 26 Sep 2020 12:19PM