మేనేజ్‌మెంట్ కోటా భర్తీకి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
30 శాతం సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కాలేజీల వారీగా మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 18లోగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలని, వచ్చే నెల 5వ తేదీలోగా సీట్లను భర్తీ చేయాలని మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే మేనేజ్‌మెంట్ కోటాలో చేర్చుకున్న విద్యార్థుల జాబితాను తమకు సబ్మిట్ చేసే తేదీని తరువాత వెల్లడిస్తామని ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
Published date : 15 Oct 2020 03:10PM