Skip to main content

మేలో జరగాల్సిన ‘సీఏ’ పరీక్షలను జూన్, జూలైకి రీ-షెడ్యూల్

గుంటూరు ఎడ్యుకేషన్: కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ కోర్సులకు సంబంధించిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి.

మే 2వ తేదీ నుంచి 18 వరకూ జరగాల్సిన పరీక్షలను రీ-షెడ్యూల్ చేస్తున్నట్టు న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) మార్చి 27 (శుక్రవారం)నప్రకటించింది.

న్యూఢిల్లీలోని ఐసీఏఐ ప్రకటించిన రీ-షెడ్యూల్ తేదీలు..

  • జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో సీఏ ఫౌండేషన్ కోర్సులో పాత విధానం ప్రకారం పరీక్షలు జరగనున్నాయి.
  • ఇంటర్మీడియెట్ (ఐపీసీ) కోర్సు పాత విధానాన్ని అనుసరించి గ్రూప్-1 విభాగంలో జూన్ 20, 22, 24, 26వ తేదీల్లోనూ, గ్రూప్-2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ తేదీల్లో జరగనున్నాయి.
  • కొత్త విధానాన్ని అనుసరించి గ్రూప్-1 విభాగంలో జూన్ 20, 22, 24, 26వ తేదీలు, గ్రూప్-2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి.
  • సీఏ-ఫైనల్ కోర్సు పరీక్షలు పాత విధానం.. గ్రూప్-1 విభాగంలో జూన్ 19, 21, 23, 25వ తేదీల్లోనూ, గ్రూప్-2 విభాగంలో జూన్ 27, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి.
  • సీఏ-ఫైనల్ కొత్త విధానంలో పరీక్షలు గ్రూప్-1 విభాగంలో జూన్ 19, 21, 23, 25 తేదీల్లో, గ్రూప్-2 విభాగ పరీక్షలు జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో జరగనున్నాయి.
  • ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పార్ట్-1 పరీక్షలు గ్రూప్-ఏ విభాగంలో జూన్ 20, 22, గ్రూప్-బి విభాగంలో జూన్ 24, 26వ తేదీల్లో జరగనున్నాయి.
  • ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ - అసెస్‌మెంట్ టెస్ట్ పరీక్ష జూన్ 27, 29వ తేదీల్లో జరుగుతాయి.
  • దేశ వ్యాప్తంగా 207 ప్రధాన నగరాలు, పట్టణాల్లో జరగనున్న సీఏ పరీక్షలకు దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు.
Published date : 28 Mar 2020 03:15PM

Photo Stories