Skip to main content

మార్చి 6 వరకు జేఈఈ మెయిన్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్ పరీక్షల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.
ఈనెల 15, 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఈనెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. ఫీజును 6వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఆన్ లైన్ లో చెల్లించవచ్చని వెల్లడించింది. ఇక ఏప్రిల్‌ 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించే.. మే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల కోసం కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఏప్రిల్, మే నెలల్లో కూడా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఇటు మార్చి, ఏప్రిల్‌ మే నెలల జేఈఈ మెయిన్ పరీక్షల కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు సెషన్, కేటగిరీ, సబ్జెక్టు తదితర వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని సూచించింది.

వెబ్‌సైట్‌లో ప్రొవిజినల్‌ జవాబు ‘కీ’..
ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్ ప్రొవిజినల్‌ జవాబు ‘కీ’లను, ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని ఎన్టీఏ తెలిపింది. ప్రశ్నలపై అభ్యంతరాలుంటే విద్యార్థులు చాలెంజ్‌ చేయవచ్చని వెల్లడించింది. అయితే ప్రశ్నకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని.. ఈనెల 3న సాయంత్రం 5 గంటల వరకే ఈ అవకాశమని పేర్కొంది.
Published date : 03 Mar 2021 05:38PM

Photo Stories