మార్చి 27లోగా అన్ని శాఖల పరిధిలో ఖాళీ పోస్టుల వివరాలు పంపండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేరకు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మళ్లీ కదలిక వచ్చింది.
రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏర్పడిన ఖాళీల్లో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా ఈ నెల 27లోగా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో 50 మందికి పదోన్నతులు..వాణిజ్య పన్నుల శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 26 Mar 2021 03:35PM