లాటరీ ద్వారా గురుకుల కాలేజీల్లో 2020-21 ప్రవేశాలు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఏడు జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకై ఏపీఆర్‌జేసీ సెట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించనున్నట్లు సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎం.ఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు.
బుధవారం గుంటూరులో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2020-21కి సంబంధించి ఇంటర్‌లో ప్రవేశాలకు ఆంధ్ర ప్రాంత విద్యార్థులను గుంటూరు జిల్లా కలెక్టర్, రాయలసీమ ప్రాంత విద్యార్థులను కర్నూలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారు నిర్ణయించిన ప్రదేశంలో లాటరీ ద్వారా ఎంపిక చేసి కళాశాలల కేటాయింపును వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో చేపడతామని చెప్పారు.
Published date : 13 Aug 2020 03:00PM