కఠినంగా జేఈఈ మ్యాథ్స్.. మొదటిరోజు 15వేల మంది హాజరు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, సీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ రెండో విడత (మార్చి నెల) పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 792 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,19,638 మంది రిజిస్టర్ చేసుకోగా, తెలంగాణ నుంచి 53 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో రాష్ట్రం నుంచి మొదటి రోజు పరీక్షలకు 15 వేల మంది వరకు హాజరైనట్లు అంచనా. ఇక, ఫిబ్రవరితో పోల్చితే ఇప్పుడు ప్రశ్నలు కఠినమైనవని, సుదీర్ఘ కాలిక్యులేషన్ అవసరమైనవి ఎక్కువగా ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎం.ఎన్.రావు, ఉమాశంకర్ తెలిపారు. 2 సెషన్లలో ప్రశ్నల సరళి అలాగే ఉందని పేర్కొన్నారు. ఊహించినట్లుగానే ఆల్‌జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. ఫిజిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఎలక్ట్రోస్టాటస్టిక్స్, మ్యాగ్నటిజం, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్ నుంచి వచి్చనట్లు తెలిపారు. మెకానిక్స్ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయని, రెండు సెషన్లలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయని వివరించారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచి్చనట్లు వివరిం చారు. కెమిస్ట్రీలో కొన్ని ప్రశ్నలు మాత్రం గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని తెలిపారు.
Published date : 17 Mar 2021 03:14PM