కోవిడ్ నియంత్రణకు వాలంటీర్లు కావాలి: ఏపీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కోవిడ్- 19 నియంత్రణ కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పనిచేసేందుకు అన్ని కేడర్లు, ర్యాంకుల రిటైర్డు ఆర్మీ, పారామిలటరీ, పోలీసు, ఎక్సైజ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ర్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
వీరు రోగులకు వైద్య సేవలు అందించడం, రవాణా, భద్రత తదితర సేవల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి www.transport.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ నెల 22తో దరఖాస్తుల డగువు ముగుస్తుందని చెప్పారు.
Published date : 15 Apr 2020 06:15PM