కోరుకొండ సైనిక పాఠశాలలో2021-22 ప్రవేశాలు
Sakshi Education
విజయనగరం రూరల్: ఆల్ ఇండియా సైనిక్ స్కూళ్లలో రానున్న విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, కల్నల్ అరుణ్ కులకర్ణి తెలిపారు.
ఈ మేరకు ఆయన నవంబర్ 13న ఒక ప్రకటన విడుదల చేస్తూ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19 వరకు అవకాశం ఉందన్నారు. మనిన్ని వివరాలకు 8178359845, 9650173668, 9599676953, 8882356803 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Published date : 16 Nov 2020 05:18PM