కేంద్రీయ విద్యాలయాల 2021– 22 ప్రవేశాలు షురూ
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: 2021–22 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది.
విద్యార్థులు రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో ఏప్రిల్ 1 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో కలిపి మొదటి తరగతి కోసం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ జరుగనుంది. రెండవ తరగతి, ఆపై తరగతుల ప్రవేశాలకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 15 మధ్య ఆఫ్‌లైన్ మోడ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. కోవిడ్ కారణంగా 2021–22 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ ప్రవేశం కోసం అధికారిక ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అన్ని తరగతుల ప్రవేశాలకు 31.03.2021 నాటికి నిర్ధేశిత వయస్సు ఉండాలి. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అడ్మిషన్ మార్గదర్శకాల ప్రకారం సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పరిధిలో దేశవ్యాప్తంగా 1,247 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయి.
Published date : 29 Mar 2021 04:17PM