జూన్ లో ఉమ్మడి ఎంట్రన్స్ లు: ఉన్నత విద్యామండలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కోర్సులు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వచ్చే ఏడాది జూన్‌లో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
సాధారణంగా ఏప్రిల్, మేలో నిర్వహించే ఈ సెట్‌లపై కరోనా ప్రభావం పడింది. వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు తెరుచుకోలేదు. బోధన, అభ్యసన కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌లోనే నడుస్తున్నాయి. దీంతో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల నిర్వహణ, ఇంటర్ పరీక్షలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పరీక్షలు ముగిశాకే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే మేలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్గాలు యోచిస్తున్నాయి. దీంతో జూన్‌లో సెట్‌లు నిర్వహించే అవకాశముంది. మరోవైపు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Published date : 29 Dec 2020 01:21PM