Skip to main content

జూలై 25న బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ – 2021 ప్రవేశ పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు అర్హత పరీక్ష జూలై 25న నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఈ పరీక్ష ఉంటుందని, పరీక్షకు వారం ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ అర్హత పరీక్షకు జూలై 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

చ‌ద‌వండి: కంది ఐఐటీలో కొత్తగా ఏడు ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులు..

చ‌ద‌వండి: విద్యార్థుల వీసాలకు అపాయింట్‌మెంట్లు షురూ...

చ‌ద‌వండి: ఇంటర్ మార్కులెలా?.. సీబీఎస్ఈ విధానమా లేక ఫస్టియర్ మార్కుల ఆధారంగానా?
Published date : 28 Jun 2021 04:27PM

Photo Stories