జామ్-2020 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఐఐటీల్లో ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్‌డీ, ఇతర డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జామ్ 2020 అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇందుకు సంబంధించి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్) 2020ను ఐఐటీ కాన్పూర్ ఇప్పటికే నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జామ్ ప్రవేశాల పోర్టల్ joaps.iitk.ac.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 9న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఏప్రిల్ 20కు వాయిదా పడింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేది మే 10. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.600లను నెట్ బ్యాంకింగ్/డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. మొదటి ప్రవేశ జాబితాను జూన్ 15న, రెండో ప్రవేశ జాబితాను జూన్ 30న, చివరి ప్రవేశ జాబితాను జూలై 15న విడుదలచేస్తారు. జూలై 2 నాటి కల్లా ప్రవేశాలు పూర్తవుతాయి.
Published date : 27 Apr 2020 04:24PM