ఈసెట్‌కు 90.83% హాజరు... రేపు పాలిసెట్ పరీక్ష!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (ల్యాటరల్ ఎంట్రీ) సోమవారం నిర్వహించిన ఈసెట్ పరీక్షకు 90.83 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఈసెట్ కన్వీనర్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. 28,016 మంది విద్యార్థులకు గాను 25,448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొ. ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు పర్యవేక్షించా రని వెల్లడించారు. ఉదయం పరీక్షకు 20 కేంద్రాల్లో 95% మంది, ఒక కేంద్రంలో 100% విద్యార్థులు హాజరయ్యారని, మధ్యాహ్నం 21 కేంద్రాల్లో 95 శాతానికి పైగా హాజరయ్యారని వివరించారు.
Check POLYCET Model Papers
రేపు పాలిసెట్ పరీక్ష
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2020 పరీక్షను ఈ నెల 2న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు ఉదయం 10 గంటల కల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు తెచ్చుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు 73,918 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

Published date : 01 Sep 2020 03:54PM