Highest Paid IT CEO In India : దేశంలో అత్యధిక శాలరీ తీసుకునే సీఈవో ఈయనే..!
అందుకే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు, సీఈవోలకు కళ్లు చెదిరేలా వేతనాల్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన ఏ ఐటీ కంపెనీ సీఈవో అత్యధిక వేతనం పొందుతున్నారో తెలుసా? ఇంతకీ ఆయన పేరేంటీ? ఆ సంస్థ ఏంటో తెలుసుకోవాలని ఉందా?
అత్యధికంగా..
నిన్న మొన్నటి వరకు మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలో అత్యధిక వేతనం పొందిన సీఈవోలో జాబితాలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ నిలిచారు. ఆయన ఏడాదికి రూ.71కోట్ల వేతనం పొందుతున్నట్లు ఈ ఏడాది మే నెలలో ఆ కంపెనీ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా తెలిపింది. తాజాగా సలీల్ పరేఖ్ కంటే అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీ యూఎస్ ఆధారిత సీఈవో సి.విజయ్ కుమార్ రూ.123.13 కోట్ల శాలరీ పొందినట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక ఫలితాల నివేదిక పేర్కొంది. అయితే సీఈవో విజయ్ కుమార్ రూ.123.13 కోట్లను శాలరీ రూపంలో ఇవ్వలేదని, కొంత మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఇన్‌సెన్‌టీవ్స్(ఎల్‌టీఐ (స్టాక్స్) రూపంలో అందించినట్లు హెచ్‌సీఎల్ యాజమాన్యం తెలిపింది.
శాలరీ ఇలా ఇచ్చారు..?
హెచ్‌సీఎల్ టెక్నాలజీ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ సంస్థ సీఈవో సి.విజయ్ కుమార్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది. తమ సంస్థ సీఈవో బేసిక్ యాన్యువల్ శాలరీ 2 మిలియన్ డాలర్లు ఉండగా, సంస్థకు లాభాల్ని తెచ్చినందుకు ప్రోత్సహకాల కింద మరో 2 మిలియన్ డాలర్లు, బోనస్‌లు ఇతర అలవెన్స్‌లు 0.02 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వెల్లడించింది. మొత్తంగా ఎల్‌టీఐ 12.50 మిలియన్ డాలర్లను కలుపుకొని విజయ్ కుమార్ వేతనం 16.52 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది.
సీఈవోల శాలరీ ఎంతంటే..?
2021-2022లో మనదేశానికి చెందిన సీఈవోలు అత్యధిక వేతనం తీసుకోవడంలో సరికొత్త రికార్డ్‌లను సృష్టిస్తున్నారు. 2021-2022లో ఏడాదికి ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75కోట్లు,హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయ్ కుమార్ శాలరీ రూ.123.13కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్‌సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు.