Job Eligibilities: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హతలు ఈ యూనివర్సిటీల నుంచే..ఎలా అంటే..?
అయితే ఈ ఏడాది మన దేశంలోని ప్రముఖ విద్యాలయాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటాయి. ఏకంగా 27వ స్థానంతో టైమ్స్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో నిలిచింది ఐఐటీ ఢిల్లీ.
మన దేశం నుంచి..
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021లో ఢిల్లీ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ 32వ ర్యాంక్), యూనివర్సిటీ ఆఫ్ చికాగో(33వ ర్యాంక్)లను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎక్కువమందిని ఢిల్లీ ఐఐటీ అందిస్తోందన్నమాట. ఇక ఈ లిస్ట్‌లో టాప్-100లో బెంళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc(61), ఐఐటీ బాంబే(97) కూడా చోటు దక్కించుకున్నాయి. గతంలో వీటి ర్యాంక్స్ 71, 128గా ఉండగా.. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్(162), ఐఐటీ ఖరగ్‌పైర్ (170), అమిటీ యూనివర్సిటీ(225), బెంగళూరు యూనివర్సిటీ(249) స్థానాల్లో నిలిచాయి.
ఈ అంశాల్ని పరిగణనలోకి..
ఇక క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ టాప్ 150లో ఢిల్లీ, బాంబే ఐఐటీలు స్థానం దక్కించుకున్నాయి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌ను ఉద్యోగుల సబ్జెక్ట్ స్పెషలైజేషన్, గ్రాడ్యుయేట్ స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఎక్సలెన్స్, డిజిటల్ పర్‌ఫార్మెన్స్, ఫోకస్ ఆన్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్-డిజిటల్ లిటరసీ, ఇంటర్‌నేషనలిజం, స్పెషలైజేషన్.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు.
టాప్ ప్లేస్‌లో..
ది గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021 లో మాసెచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆసియా నుంచి టోక్యో యూనివర్సిటీ(6), సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ (9) మాత్రమే టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నాయి.