గురుకుల ఔట్‌సోర్సింగ్ టీచర్ల హర్షం: ఎందుకంటే..
Sakshi Education
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరానికి కొనసాగిస్తూ ప్రభుత్వం రెన్యువల్ చేసినందుకు గానూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్ అండ్ లెక్చరర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. లక్ష్మీనాయక్, బి. దమయంతి బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
జూన్ నెల నుంచి రావాల్సిన జీతాలు కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు నిర్ణయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 1,700 కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.
Published date : 19 Nov 2020 01:44PM