గందరగోళంలో జేఈఈ మెయిన్-2021 నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పటినుంచంటే..
Sakshi Education
సాక్షి హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం విడుదల చేసే జేఈఈ మెయిన్-2021 నోటిఫికేషన్ గందరగోళంలో పడింది.
వచ్చేఏడాది ఫ్రిబవరి 22 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. 90 ప్రశ్నలు ఇస్తామని, అందులో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందని వివరించింది. అయితే, పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ ఖరారు చేయకపోవడంతో ఎన్‌టీఏ తన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంది. వెబ్‌సైట్ నుంచి నోటిఫికేషన్‌ను తొలగించింది.
Published date : 16 Dec 2020 03:19PM