ఏప్రిల్ 3న టీఎస్ ఐసెట్– 2021 నోటిఫికేషన్.. షెడ్యూల్ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్–2021 నోటిఫికేషన్ను వచ్చే నెల 3వ తేదీన జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఐసెట్ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించగా, హైదరాబాద్ నుంచి టీఎస్ ఐసెట్ చైర్మన్, కేయూ ఇన్చార్జి వీసీ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి వివరాలు వెల్లడించారు. విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను వచ్చే నెల 7వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు స్వీకరిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలను ఆగస్టులో మూడు సెషన్లలో నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేసింది. అయితే పరీక్ష తేదీని మాత్రం తరువాత వెల్లడిస్తామని పేర్కొంది. గతంలో ఉన్నట్లుగానే విద్యార్థులకు 25 శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పరీక్షలకు హాజరైతే చాలు అర్హులుగానే పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి నిర్ణీత తేదీ తరువాత స్వీకరించే దరఖాస్తుల ఆలస్య రుసుమును సగానికి తగ్గించారు. గతంలో నిర్ణీత తేదీ తరువాత మొదటి 15 రోజుల వరకు రూ. 500 ఉండగా, దానిని రూ. 250కి తగ్గించారు. ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 650గా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 450గా నిర్ణయించారు.
తెలంగాణ ఐసెట్ 2021 పరీక్షల షెడ్యూల్, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్, స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మోడల్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఇదీ షెడ్యూలు..
తెలంగాణ ఐసెట్ 2021 పరీక్షల షెడ్యూల్, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్, స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మోడల్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఇదీ షెడ్యూలు..
- 3–4–2021: నోటిఫికేషన్ జారీ
- 7–4–2021: ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- 15–6–2021: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపు
- 30–6–2021 వరకు: రూ. 250 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ
- 15–7–2021 వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ
- 30–7–2021 వరకు: రూ. 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ
- పరీక్షలు: ఆగస్టులో
- పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్, రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో సెషన్.
Published date : 04 Mar 2021 02:53PM