ఏపీ ఈఏపీసెట్- 2021 షెడ్యూల్ విడుదల..ఈ విద్యార్థులకు అనుమతి లేదు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్) షెడ్యూల్ విడుదలైంది.
ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్‌టీయూకు అప్పగించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆగస్టు 25న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, కరోనా పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Published date : 17 Aug 2021 06:25PM