Skip to main content

ఏపీ ఐసెట్‌కు 78.83% విద్యార్థులు హాజరు

యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఏపీఐసెట్-2020కి 78.83 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులు పాటు కొనసాగే ఈ పరీక్షలను శుక్రవారం కూడా నిర్వహించనున్నారు.

  • 45 పట్టణాలు, 75 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 64,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజుకు 32,505 మంది దరఖాస్తు చేసుకోగా 25,624 మంది ప్రవేశ పరీక్షలు రాశారు. కాగా 6,881 మంది హాజరు కాలేక పోయారు. మొదటిరోజు 78.83 శాతం హాజరయ్యారు.
  • కోవిడ్ నేపథ్యంలో అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. తిరుపతి, నెల్లూరు కేంద్రాల్లో ఒక్కో అభ్యర్థి మినహా మిగతా ఎక్కడా సమస్య ఎదురు కాలేదన్నారు. ఆ రెండు కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఎదరయ్యాయని, వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి ప్రవేశ పరీక్షలు రాయించామని ఆయన చెప్పారు.
Published date : 11 Sep 2020 02:33PM

Photo Stories