ఎన్‌టీఎస్‌ఈ- 2020 పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) లెవల్ -1 పరీక్ష కోసం ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో టెన్త్ చదువుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 10లోగా ఫీజు చెల్లించాలని, 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూరించి సబ్మిట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు బీఎస్‌ఈ తెలంగాణ వెబ్‌సైట్ చూడాలని పేర్కొన్నారు.
Published date : 17 Oct 2020 03:01PM