ఏఎన్‌యూ బీటెక్ పరీక్షలు అక్టోబరుకు వాయిదా
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిధిలో జరగాల్సిన బీటెక్ కోర్సులకు సంబంధించిన పలు పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ సీఈ ఉషారాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 18న జరగాల్సిన 3/4 బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబరు 5కి, అక్టోబరు ఒకటిన జరగాల్సిన 2/4 బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబరు 15కి, అక్టోబరు 16న జరగాల్సిన 1/4 బీటెక్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబరు 27కి వాయిదా వేసినట్లు తెలిపారు.
Published date : 12 Sep 2020 01:38PM