Skip to main content

దరఖాస్తు చేయని వారికీ అవకాశం: నేడు, రేపు ఏఎన్‌యూ పీజీసెట్ - 2020 పరీక్షలు

ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలలు, ఒంగోలులోని టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏఎన్‌యూ పీజీసెట్-2020 ప్రవేశ పరీక్షలు 10, 11 తేదీల్లో జరుగుతాయని యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ బి.హరిబాబు తెలిపారు.
ప్రతిరోజూ మూడు సెషన్లలో సబ్జెక్టుల వారీగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. ఏఎన్‌యూ పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభమయ్యే ఒక గంట ముందు వెళ్లి విద్యార్హత పత్రాలతో పాటు రూ.500 ఆలస్య రుసుము చెల్లించి నేరుగా పరీక్షకు హాజరుకావచ్చని తెలిపారు.
Published date : 10 Oct 2020 12:32PM

Photo Stories