డిసెంబర్ 28న ‘పీజీ సెట్’ సీట్ల కేటాయింపు
Sakshi Education
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏఎన్‌యూ పీజీ సెట్-2020 సీట్ల కేటాయింపు ఈనెల 28వ తేదీన జరుగుతుందని అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ బి.హరిబాబు తెలిపారు.
సర్టిఫికెట్ల పరిశీలన, ఆన్‌లైన్‌లో కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు ఈ నెల 27 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోగా ఫీజు చెల్లించాలన్నారు.
Published date : 28 Dec 2020 02:25PM