డీఈఈ సెట్- 2020 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్-2020 ఫలితాలను విడుదల చేసినట్లు శుక్రవారం డీఈఈ సెట్ కన్వీనర్ కృష్ణారావు ప్రకటించారు.
మెరిట్ జాబితాలు/ ర్యాంకు కార్డులను ఈనెల 24వ తేదీ నుంచి http://deecet.cdse.telangana.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల తేదీలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. డీఈఈ సెట్ తెలుగు మాధ్యమంలో 3,335 మంది హాజ రు కాగా 2,371 మంది (70.19 శాతం) అర్హత సాధించారని వివరించారు. ఆంగ్ల మాధ్యమంలో 3,979 మంది పరీక్ష రాయగా 3,158 మంది (79.36 శాతం) అర్హత సాధించారని, ఉర్దూలో 1,199 మంది పరీక్ష రాయగా 358 మంది (29.85 శాతం) అర్హత సాధించినట్లు వెల్లడించారు. తెలుగులో అత్యధిక మార్కులు (63) ఎస్.నవీన, ఆంగ్ల మాధ్యమంలో జి.సాకేత్‌కుమార్ (74 మార్కులు), ఉర్దూ మాధ్యమంలో ఉమ్ ఏ హబీబా (73 మార్కులు) సాధించారని తెలిపారు.
Published date : 24 Oct 2020 04:43PM