Skip to main content

Bumper offer : ఈ ప్ర‌ముఖ కంపెనీలోని ఉద్యోగుల‌కు..ప్రతీ ఒక్కరికీ లక్షకిపైగా బోనస్‌!

ఆల్ఫాబెట్‌ కంపెనీకి చెందిన గూగుల్‌ ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించింది. కిందటి వారమే ‘ఆఫీస్‌ రిటర్న్‌’ పాలసీని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే.
Employees
Employees

తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు అదనపు స్టాఫ్‌ బోనస్‌ ప్రకటించింది. 

బోనస్‌తో పాటు ఈ అదనపు బోనస్‌..
కరోనా టైంలో సంస్థ కోసం పని చేస్తున్న తమ ఉద్యోగులందరికీ అండగా నిలిచేందుకు ముందుకొచ్చినట్లు డిసెంబ‌ర్ 8వ తేదీన‌ గూగుల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.  ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ఆఫీసులలో పని చేసే ఉద్యోగులతో పాటు ఎక్స్‌టెండ్‌ వర్క్‌ఫోర్స్‌, ఇంటర్న్స్‌కి కూడా వన్‌ టైం క్యాష్‌ బోనస్‌గా 1,600 డాలర్లు(మన కరెన్సీలో లక్షా 20 వేల దాకా) అందించనున్నట్లు పేర్కొంది. వర్క్‌ఫ్రమ్‌ హోం  అలవెన్స్‌, వెల్‌బీయింగ్‌(సంక్షేమ) బోనస్‌తో పాటు ఈ అదనపు బోనస్‌ అందించనున్నారు. ఇక ఇందుకోసం ఎంత బడ్జెట్‌ కేటాయించారనే విషయాన్ని గూగుల్‌ ప్రతినిధి వెల్లడించలేదు.

ఇంటి నుంచే ప‌ని..!
ఈ ఏడాది మార్చిలో గూగుల్‌ చేపట్టిన అంతర్గత సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కిందటి ఏడాదితో పోలిస్తే..ఈ ఏడాది ఉద్యోగులకు అందుతున్న బెనిఫిట్స్‌ బాగోలేవని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు . దీంతో కంపెనీ హుటాహుటిన వెల్‌బీయింగ్‌ బోనస్‌ కింద 500 డాలర్లు(మన కరెన్సీలో 37వేల రూపాయలకు పైనే) అందించింది. ఇక జనవరి 10, 2022 నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని ఆదేశించిన గూగుల్‌.. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో పాటు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి ఆదేశాలను సైతం నిలుపుదల చేసింది.

Published date : 09 Dec 2021 01:13PM

Photo Stories