Skip to main content

బుక్‌లెట్ రూపంలో ఐఐటీ-జేఈఈ సమాచారం

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ-జేఈఈ (అడ్వాన్‌‌సడ్)కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్, విద్యారంగ సలహాదారుడు కె.లలిత్‌కుమార్ పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు.
ఐఐటీ-జేఈఈకి సంబంధించి 12 సంవత్సరాల అనుభవంతో ఆయన తీసుకువస్తున్న వంద పేజీల పుస్తకం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కోసం నిర్దేశించింది. 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాలంలో జేఈఈ అడ్వాన్‌‌సడ్ ఫలితాలు, మార్కులు, ర్యాంకుల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. సీట్ల కేటాయింపు విషయాన్ని కూడా ఇందులో వివరించారు. ప్రశ్నల కేటాయింపు, కటాఫ్ మార్కులు, రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు తదితర సమగ్ర సమాచారం కూడా ఇందులో లభిస్తుంది. ఈ పుస్తకం కోసం 9849016661 నంబరుకు వాట్సాప్ చేయొచ్చని లలిత్‌కుమార్ తెలిపారు.
Published date : 21 Jan 2020 02:34PM

Photo Stories