Skip to main content

Bank holidays 2023 : ఏప్రిల్ నెలలో సగం రోజులు బ్యాంకులకు సెల‌వులు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏప్రిల్ నెల‌లో బ్యాంక్‌ల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్‌లో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకు సెలవులున్నాయి.
Bank Holidays
Bank Holidays in April 2023

రెండో  శనివారం, ఆదివారాలు, సెలవులు, పండగలు కలిసి ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.  దాదాపు నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవు. అయితే ఆన్‌లైన్‌సేవలు, యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదనేది గమనార్హం.

☛➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

ఏప్రిల్ నెలలో సెలవులు ఇవే..

bank holidays details in telugu

☛ ఏప్రిల్ 1 : కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న మిజోరం, చండీగఢ్, మేఘాలయ,  హిమాచల్ ప్రదేశ్ మినహా,  బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 2, 9,16,23,30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
☛ ఏప్రిల్ 4 : మహావీర్ జయంతిని పురస్కరించుకుని  వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి 
☛ ఏప్రిల్ 5 : బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 7 :  గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 8 : రెండో శనివారం, అలాగే 22 నాలుగో శనివారం
☛ ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 15 : వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
☛ ఏప్రిల్ 18 : షాబ్ ఇ బకర్ కారణంగా జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
☛ ఏప్రిల్ 21 :  రంజాన్ ఈద్( ఈద్ ఉల్ ఫితర్‌)  అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

➤☛ Telangana Schools Summer Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

Published date : 27 Mar 2023 01:25PM

Photo Stories