బీఎఫ్‌ఏ, ఎంపీఈడీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): బీఎఫ్‌ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్స), ఎంపీఈడీ (మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు.
బీఎఫ్‌ఏ ప్రవేశ పరీక్షలో గుంటూరు జిల్లాకు చెందిన డీవీ అనిల్ కుమార్ మొదటి ర్యాంకు, కృష్ణాజిల్లాకు చెందిన సీహెచ్ ఉదయ శంకర్ రెండో ర్యాంకు, ఎ.బాలాజీ వరప్రసాద్ మూడో ర్యాంకును పొందారు. ఎంపీఈడీలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన విజయశాంతి మొదటి, ప్రకాశం జిల్లాకు చెందిన వి.ఆంజనేయులు రెండవ, భద్రాచలానికి చెందిన కె.దుర్గారావు మూడవ ర్యాంకును సాధించారు. ఫలితాలను ఏఎన్‌యూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Published date : 06 Nov 2020 04:10PM