అటెన్షన్: ఆన్‌లైన్‌లో నకిలీ పోలీస్ నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీల భర్తీకోసం సన్నాహాలు చేస్తుంటే మరికొందరు ఆకతాయిలు ఏకంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.
తాజాగా ఆన్‌లైన్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) జారీ చేసినట్లుగా 31 పేజీల నకిలీ నోటిఫికేషన్ హల్‌చల్ చేస్తోంది. ఇది ‘టీఎస్ పోలీస్ నోటిఫికేషన్– 2021’ పేరుతో విడుదలైంది. మొత్తం 19,725 పోస్టులు భర్తీ చేస్తున్నామని, అందులో 425 ఎస్సై పోస్టులు, మిగిలిన 19 వేలు సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు అని పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, డిసెంబరు 27న పరీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించడం గమనార్హం. అంతేకాదు ఓసీలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఎన్నెన్ని పోస్టులు కేటాయించిందో, ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులో కూడా పొందుపరిచారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కోసం పీఆర్‌బీ వెబ్‌సైట్ చిరునామా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ చూసి చాలామంది తికమక పడుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచించారు.
చదవండి: కొత్త విద్యా విధానంతో విద్యార్థులు, టీచర్లకూ ఎంతో మేలు
చదవండి: ఏపీ గురుకుల విద్యార్థులకు ప్రయివేటు స్కాలర్‌షిప్‌లు, స్టెఫండ్‌లు
చదవండి: ఆన్‌లైన్ ద్వారా ఇంటర్మీడియెట్ 2021 ప్రవేశాలు షురూ.. రిజిస్ట్రేషన్ ఇలా..
చదవండి: కొత్త విద్యా విధానంతో విద్యార్థులు, టీచర్లకూ ఎంతో మేలు
చదవండి: ఏపీ గురుకుల విద్యార్థులకు ప్రయివేటు స్కాలర్‌షిప్‌లు, స్టెఫండ్‌లు
చదవండి: ఆన్‌లైన్ ద్వారా ఇంటర్మీడియెట్ 2021 ప్రవేశాలు షురూ.. రిజిస్ట్రేషన్ ఇలా..
Published date : 14 Jul 2021 04:32PM