అన్ని కాలేజీలకు న్యాక్, ఎన్బీఏ గుర్తింపు తప్పనిసరి: ఉన్నత విద్యా శాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదాయ, సాంకేతిక, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలన్నింటికీ న్యాక్, ఎన్బీఏ తదితర గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని ఉన్నత విద్యా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జీవో విడుదలైన మూడేళ్లలో ఇందుకోసం ఆయా సంస్థలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థలకు సహకరించేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా తమ పరిధిలోని విద్యా సంస్థలు న్యాక్ తదితర అక్రిడిటేషన్ పొందేలా సహకారం అందించడంతో పాటు ఆ చర్యల ప్రగతి సమాచారాన్ని ప్రభుత్వానికి పంపాలని ఉన్నత విద్యా శాఖ ఆదేశించింది.
Published date : 03 Feb 2021 05:40PM