Skip to main content

అక్టోబర్ 4 న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష: అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

సాక్షి, అమరావతి: అక్టోబర్ 4వ తేదీన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లోని 68 పరీక్ష కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ రాత పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం వెల్లడించారు.
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు కో-ఆర్డినేటింగ్ సూపర్‌వైజరీ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల్లో ఇద్దరేసి సీనియర్ ఐఏఎస్ అధికారులు, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమించినట్టు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Check Civils prelims previous papers and practice tests 

గంట ముందే చేరుకోవాలి
  • పరీక్షలకు మొత్తం 30 వేల 199 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
  • అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి.
  • పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందే కేంద్రాల గేట్లను మూసివేస్తారు.
  • పరీక్ష కేంద్రాల్లోకి బ్యాగ్‌లు, మొబైల్ ఫోన్లు, ఐటీ సంబంధిత వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ సంబంధిత వస్తువులను అనుమతించరు.
  • పతి అభ్యర్థి విధిగా మాస్క్ లేదా ఫేస్ కవర్ ధరించాలి. పరీక్ష కేంద్రాల ప్రాంగణాలు, ప్రవేశ ద్వారాలు, పరీక్ష హాళ్లలోని టేబుళ్లు, కుర్చీలు, వాష్ రూమ్‌లను పూర్తిగా శానిటైజ్ చేయించాలని ఆదేశం.
  • పరీక్ష హాల్‌లో అభ్యర్థికి.. అభ్యర్థికి మధ్య 2 చదరపు మీటర్ల భౌతిక దూరం ఉండే విధంగా సీటింగ్ ఏర్పాట్లు.
Published date : 26 Sep 2020 12:42PM

Photo Stories