ఐసెట్ కౌన్సెలింగ్‌పై వివరణ ఇవ్వండి.. ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ప్రకటించక ముందే ఐసెట్ ద్వారా ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించడంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఐసెట్‌లో మంచి ర్యాంక్ సాధించినా, సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే కౌన్సెలింగ్ నిర్వహించడంతో అనేక మంది విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ చదివే అవకాశం కోల్పోతున్నారంటూ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎ.ఆనంద్ ప్రజాహితవ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
Published date : 07 Jan 2021 06:16PM