Agnipath Scheme: అగ్నివీరులకు కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్లు
త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అగ్నిపథ్’ పథకం(Agnipath Scheme) దేశ వ్యాప్తంగా అగ్గి పుట్టించింది. ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నవారు, పాత రిక్రూట్‌మెంట్లలో వివిధ దశలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధ్వంసం చెలరేగింది. ఈ నేపథ్యంలో యువతకు ఊరట కలిగించేలా శనివారం(జూన్ 18) కేంద్రం కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
ఎస్ఎస్‌సీ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
ఆర్ఆర్‌బీ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్