Skip to main content

ఆగస్టు 5న ఏపీ పీసెట్‌– 2021 నోటిఫికేషన్‌

ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీపీఈడీ (బాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), యూజీడీపీఈడీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీపీసెట్‌–2021 నోటిఫికేషన్‌ను ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తామని పీసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి.జాన్సన్‌ తెలిపారు.
పీసెట్‌కు ఆన్‌లైన్‌లో ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. రూ.500 ఆలస్య రుసుంతో సెప్టెంబరు 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెప్టెంబరు 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

చ‌ద‌వండి: ఐఐటీ రూర్కిలో ఏడు కొత్త కోర్సులు.. ఈ విద్యా సంవత్సరం నుంచే..

చ‌ద‌వండి: ప్లాష్ న్యూస్: 24 ఫేక్ యూనివర్సిటీలు గుర్తించిన యూసీజీ
Published date : 04 Aug 2021 03:26PM

Photo Stories