9 నెలలు ఆలస్యంగా టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇటీవల శిక్షణ తేదీలు ఖరారయ్యాయి.
కానీ, తమతోపాటు ఎంపికై న సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్(ఏఆర్) అభ్యర్థులతో పోలిస్తే.. శాఖాపరంగా లభించే పలు బెనిఫిట్లు కోల్పోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకబోర్డు(టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) 2018లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో దాదాపు 17 వేలమంది ఎంపికయ్యారు. అందులో 12 వేల మంది సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్(ఏఆర్) అభ్యర్థులకు ఈ ఏడాది జనవరిలోనే శిక్షణ ప్రారంభమైంది. కానీ, టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు ఏకంగా 9 నెలలు ఆలస్యంగా అక్టోబర్ ఆఖరివారంలో ప్రారం భం కానుంది. ఈ నేపథ్యంలో తాము ఈ 9నెలల్లో ఆర్థికంగా పలు ఇబ్బందులు పడ్డామని, అందుకే తమకు సివిల్, ఏఆర్ అభ్యర్థులతో సమానంగా శిక్షణతో కూడిన వేతనాన్ని అందజేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటా విషయంలో కూడా ఆవేదన చెందుతున్నారు. ఇది తమ ప్రమోషన్ల లోనూ ప్రభావం చూపిస్తుందంటున్నారు.
Published date : 07 Sep 2020 03:51PM