Skip to main content

గురువుకు గౌరవం

1998 DSC Teacher Candidate List

‘ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన అన్నం / అలసిపోయినప్పుడు దొరికిన నీడ / దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చిన బంధాలు / కష్టంలో ఉన్నప్పుడు ‘నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడు’.. ఈ నాలుగింటినీ ఎవరూ అంత తేలిగ్గా మరచిపోరు. వారి జీవిత కాలమంతా గుర్తుపెట్టుకుంటారు. గుండెల్లో గూడుకడతారు. తినే ప్రతి అన్నం మెతుకులోనూ తమ జీవితాలను సరిదిద్దిన వారిని మననం చేసుకుంటారు.. 1998 నాటి డీఎస్సీ ఉపాధ్యాయ అభ్యర్థుల మోముల్లో ఇదే గోచరమైంది. 25 ఏళ్ల తరువాత తమ ‘ఉపాధ్యాయాన్ని’ జగనన్న ప్రభుత్వం సాకారం చేయడంపై వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.

పిలిచి ఉద్యోగమిచ్చారు!

25 ఏళ్ల క్రితం భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో డీఎస్సీ రాసి అర్హత సాధించా. అయితే పోస్టులను కుదించేసి, తక్కువ సంఖ్యలో భర్తీ చేయడంతో ఆవేదన చెందా. అప్పటి నుంచి ఎంతో ఆశగా ఎదురు చూశా. వై.ఎస్‌.జగన్‌ సీఎం అయితేనే మా కష్టాలు తీరుతాయని గాఢంగా నమ్మి, 2018లో మక్కా మదీనా వెళ్లి ప్రార్ధన చేశా. 58 ఏళ్ల వయసులో ప్రభుత్వమే పిలిచి ఉద్యోగం ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు.
–షేక్‌ సైసావలీ, మాచర్ల

పోరాటాలు చేశాం

డీఎస్సీలో క్వాలిఫై అయినా ఉద్యోగం రాకపోవడంతో గతంలో న్యాయ పోరాటం చేశాం. న్యాయం చేయాలని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేక పోయింది. ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం కలలో కూడా ఊహించ లేదు.
–బి. శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు

గౌరవం కల్పించారు

1998 డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాలని ఎంతో కష్టపడ్డా. అయినా అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగం చేజారింది. 18 ఏళ్లుగా పాఠశాలల్లో పనిచేశా. కోర్టులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం పిలిచి, ఉద్యోగాన్ని ఇవ్వడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గౌరవం దక్కింది.
బొప్పూడి శ్రీనివాసరావు,

కుందురువారిపాలెం, ముప్పాళ్ల

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు 25 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. ఎప్పుడో 1998లో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ అర్హత పరీక్షలు రాసి, క్వాలిఫై అయిన అభ్యర్థులు అప్పటి ప్రభుత్వం చూపిన మొండిచేయి కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు. డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ 1999లో అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాకంతో ఉద్యోగాలను పొందలేకపోయిన అభ్యర్థులు మంచి మనసున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దయతో ఉద్యోగాలను పొందగలిగారు. ఎప్పుడో 25 ఏళ్ల నాటి విషయం తనకెందులే అని అను కోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను తెలుసుకుని మానవత్వం కలిగిన నిండైన మనస్సుతో మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) పద్ధతిపై ఉద్యోగాలను ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు వెనువెంటనే నియామకాలు పూర్తి చేసేందుకు చేపట్టిన చర్యలు ఆచరణలోకి వచ్చాయి. నాడు క్వాలిఫై అయినా పోస్టింగ్స్‌ ఇవ్వకుండా నాటి సీఎం చంద్రబాబు మొండిచెయ్యి చూపగా, ప్రస్తుతం సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్యోగాలను కల్పించారు.

226 మందికి....
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 226 మంది క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు బుధవారం గుంటూరులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో పి.శైలజ అధ్యక్షతన కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగ్స్‌ ఇచ్చారు. మొత్తం మీద కలగా మారి, ఇక ఉద్యోగాలు రావని నిరాశ, నిస్పృహలతో ఉన్న అభ్యర్థులు సీఎం వైఎస్‌ జగన్‌ పుణ్యమాని ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో వారంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్‌ ఆర్డర్‌ చేతుల్లోకి వచ్చిన ఈ ఉపాధ్యాయులు ఏమన్నారంటే...

1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్‌కు కొలువులు క్వాలిఫై అయినా పోస్టింగ్స్‌ ఇవ్వని నాటి సీఎం చంద్రబాబు 25 ఏళ్లుగా న్యాయం కోసం నిరుద్యోగుల పోరాటం మానవతా దృక్పథంతో ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 226 మందికి పోస్టింగ్‌లు మినిమం టైం స్కేల్‌ పద్ధతిపై నియామకాలు అభ్యర్థుల మోముల్లో ఆనందోత్సాహాలు

అధ్యాపకం నుంచి ఉపాధ్యాయానికి

డీఎస్సీలో ఉద్యోగం రాకపోవడంతో వేర్వేరు డిగ్రీ కళాశా లల్లో అధ్యాపక వృత్తిలోకి వెళ్లా. ప్రస్తుతం ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ కెమిస్ట్రీ గెస్ట్‌ అధ్యాపకురాలిగా పని చేస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో తిరిగి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వడం మరువలేను.
–బి. సుచరిత, గుంటూరు

Published date : 13 Apr 2023 07:53PM

Photo Stories