16,208 సచివాలయ పోస్టులకు ఇప్పటిదాకా దరఖాస్తు చేసినవారు 4,88,301 మంది
Sakshi Education
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులొస్తున్నాయి.
మొత్తం 19 రకాల పోస్టులకు జనవరి10న నోటిఫికేషన్ జారీచేసి, 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 31 అర్ధరాత్రి వరకూ దరఖాస్తులకు గడువుంది. మొత్తం 16,208 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయగా సోమవారం సాయంత్రం వరకూ 4,88,301 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డు అడ్మిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కేటగిరీ -1లో మొత్తం 1,025 పోస్టులుండగా 2,08,100 దరఖాస్తులందినట్టు చెప్పారు.
Published date : 28 Jan 2020 02:42PM