Skip to main content

15,971 సచివాలయ ఉద్యోగాలకు జనవరి 10న నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి జనవరి 10న నోటిఫికేషన్ విడుదల కానుంది.
పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ జనవరి 8న తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746, విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
 
15,971 ఉద్యోగాలతో పాటే.. మరో 3వేల పోస్టులు భర్తీ చేయండి: సీఎం జగన్
గ్రామీన‌ ప్రాంతాల్లో ఇప్పుడున్న 11,158 గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 వరకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు కొత్తగా మరో 3 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలతో పాటే వీటిని భర్తీ చేయాలని ఆదేశించారు. 3 వేలకు పైగా పోస్టులు అదనం : మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు స్టడీమెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రివియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, మాక్‌టెస్టులు, కరెంట్‌ఆఫైర్స్ మొదలైన వాటి కోసం.. క్లిక్ చేయండి
Published date : 09 Jan 2020 12:28PM

Photo Stories