Skip to main content

స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అందజేసే నేషనల్‌ ఫెలోషిప్‌ స్కాలర్‌షిప్‌లకు అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు.
Applications for Scholarships
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2023–24 విద్యాసంవత్సరంలో గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు నేషనల్‌ ఫెలోషిప్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఫిల్‌ చేస్తున్న గిరిజన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా www.fellowship. tribe.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Published date : 04 Aug 2023 05:02PM

Photo Stories