College Admissions: ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో దరఖాస్తు తేదీ
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కడప మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆక్టోబర్ 3వ తేదీలోగా స్పాట్ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అనర్హులన్నారు. కేటగిరీ వారీగా దాదాపు రూ. 6 వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Free training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఆసక్తిగల వారు ఆక్టోబర్ 3న కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని ఆమె సూచించారు. పాలీసెట్ 2023 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రథమ ప్రాధ్యాన్యం కల్పిస్తామన్నారు. ఆలాగే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ ప్రకియలో పాల్గొనవచ్చన్నారు.