Colleges: కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు
జిల్లాలోని కళాశాలలో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. మెడికల్ కాలేజీలో ప్రేషర్స్ డే ప్రోగ్రాంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో షీ టీంపై అవగాహన కల్పించారు. విద్యార్థినులపై కళాశాలలో ర్యాగింగ్ పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీలో, బస్‌స్టాప్‌ల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే.. వెంటనే జిల్లా షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 8712657676, డయల్ 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే యువత, చెడు వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని తెలియజేశారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రఘు, కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ సుగుణ, నాగర్‌కర్నూల్ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా షీ టీం ఇన్‌చార్జ్ ఏఎస్‌ఐ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.