Skip to main content

KNRUHS: పీజీ వైద్య విద్య యాజమాన్య సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య‌ విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది.
KNRUHS
పీజీ వైద్య విద్య యాజమాన్య సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయిందని వెల్లడించింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది.

చదవండి: రాష్ట్రానికి పీజీ సీట్లు.. కాలేజీల వారీగా కొత్తగా వచ్చిన పీజీ సీట్లు ఇలా..

నవంబర్‌ 30న ఉదయం 11 గంటల వరకు వెబ్‌ ఆప్ష­న్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది. 

చదవండి: Medical and Health Department: వైద్యులకు ఇష్టమైనచోట పోస్టింగ్‌

Published date : 30 Nov 2022 03:15PM

Photo Stories