విక్రమ సింహపురి యూనివర్సిటీ 6, 7వ స్నాతకోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నేడు నెల్లూరుకు రానున్నారు.
విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం
మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొని, 18 మంది విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్ అందజేస్తారు. వీరితో పాటు 252 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు. స్నాతకోత్సవం అనంతరం నగరంలోని రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రిని గవర్నర్ సందర్శిస్తారు.