Civil Assistant Surgeon: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఐపీఎం పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నవంబర్ 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి నవంబర్ 20న ఒక ప్రకటనలో వెల్లడించారు.
దరఖాస్తుదారులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత దరఖాస్తుదారుల రెండో తాత్కాలిక జాబితాను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కేటగిరీ వారీగా ప్రకటించిన పోస్టుల సంఖ్యకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచామన్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో నిర్వహిస్తారు.
చదవండి:
Published date : 21 Nov 2022 01:11PM