Skip to main content

Campus Ambassadors: క్యాంపస్‌ అంబాసిడర్స్‌కు శిక్షణ

దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఓటు హక్కు, ఓటింగ్‌ యాంత్రాలపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వివిధ కళాశాలల నుంచి క్యాంపస్‌ అంబాసిడర్స్‌గా ఎంపిక చేసిన విద్యార్థులకు ఫిబ్ర‌వ‌రి 23న‌ కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు.
Training of Campus Ambassadors

ఈ సందర్భంగా స్వీప్‌ నోడల్‌ అధికారి కె.అశోక్‌ మాట్లాడుతూ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించామన్నారు. అనంతరం మాస్టర్‌ ట్రైనర్‌ రమేష్‌, పబ్బతి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ శిక్షణ ఇచ్చారు.

చదవండి: TASK Program: విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండు రోజుల కార్యక్రమం..

కార్యక్రమంలో ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఎన్నికలన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరాజు, డీఐఈఓ కృష్ణయ్య, ప్రతాప్‌, సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

Published date : 24 Feb 2024 04:49PM

Photo Stories