Kakatiya University: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా
ఫార్మా డీ మూడో సంవత్సరం, ఐదో సంవత్సరం పరీక్షలు, డిగ్రీకి సంబంధించిన పలు పేపర్ల పరీక్షలతోపాటు పీజీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పరీక్షలను వాయిదా వేశామని తెలిపారు.
చదవండి: Kakatiya University: పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా రవికుమార్ బాధ్యతల స్వీకరణ
జూలై 26, 27, 28 తేదీల్లో వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి రీ షెడ్యూల్ టైం టేబుల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. ఇదిలా ఉండగా.. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల వర్సిటీ కళాశాలలతోపాటు అనుబంధ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించినట్లు జూలై 27న వీసీ రమేష్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జూలై 31న కళాశాలలు తెరుచుకోనున్నాయి.
చదవండి: Guest Lecturer Posts: వివిధ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం