SU: ఇన్‌స్టంట్ పరీక్షలు తేదీలు ఇవే..
![SU](/sites/default/files/images/2023/08/12/students-img-1691834920.jpg)
5వ, 6వ సెమిస్టర్లలో(సీబీసీఎస్–ఆర్19) థియరీలో గానీ ప్రాక్టికల్స్‌లో గా నీ ఒక్క పేపర్ ఫెయిలైనవారికి ఆగస్టు 26న పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒక పేపర్‌కు రూ.750 ఫీజు తోపాటు దరఖాస్తును ఆగస్టు 18వ తేదీలోగా తమ తమ కళాశాలల్లో అందించాలన్నారు. ఆగస్టు 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5వ సెమిస్టర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6వ సెమిస్టర్ పరీక్షలుంటాయని పేర్కొన్నారు.
చదవండి: Satavahana University Paper Leak: ప్రశ్నపత్రం లీకేజీలో ప్రశ్నలెన్నో..!
గడువు తేదీ తర్వాత ఎటువంటి రుసుముతోనూ దరఖాస్తు తీసుకోబోమని తెలిపరాఉ. విద్యార్థులు వారి వారి కళాశాలల్లోనే దరఖాస్తు ఫాంలు పొందవచ్చన్నారు. ఒకసారి చెల్లించిన రుసుము ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబోమని, సర్దుబాటు చేయడం ఉండదన్నారు.
చదవండి: శాతవాహన యూనివర్సిటీ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్లు లీక్? ఆధారాలు ధ్వంసం..!!